Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

15 నెలల కనిష్ట స్థాయికి పడిపోయిన సెన్సెక్స్

భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు మరో పెద్ద పతనాన్ని చవిచూశాయి. చైనా ఆర్థిక సంక్షోభం మన రూపాయి మీద పడటంతో... యూఎస్ డాలర్ తో రూపాయి విలువ 66.85కి పడిపోయింది. దీని ప్రభావం కూడా ఇన్వెస్టర్లపై ప్రభావం చూపింది. దీంతో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 308 పాయింట్లు పతనమై 24,834కు పడిపోయింది. నిఫ్టీ 96 పాయింట్లు కోల్పోయి 7,559కి దిగజారింది. సెన్సెక్స్ 25వేల మార్క్ కంటే దిగువకు పడిపోవడం కూడా ఇన్వెస్టర్ల స్థైర్యాన్ని దెబ్బతీసే అంశమే. నేటి టాప్ గెయినర్స్ లో... పీఎంసీ ఫిన్ కార్ప్ (4.91%), పీటీసీ ఇండియా (3.85%), హ్యాత్ వే కేబుల్ అండ్ డేటా (3.84%), జీవీకే పవర్ అండ్ ఇన్ ఫ్రా (3.47%), నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (2.60%)లు ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో... ఆమ్టెక్ ఆటో లిమిటెడ్ (-11.15%), విల్స్ పన్ కార్ప్ (-8.65%), జుబిలెంట్ లైఫ్ సైన్సెస్ (-8.23%), డెల్టా కార్ప్ లిమిటెడ్ (-6.15%), స్ట్రైడ్స్ ఆర్కోల్యాబ్ లిమిటెడ్ (-6.14%)లు ఉన్నాయి.

More Telugu News