Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ సాధించుకున్నది భూకబ్జాలు చేసేందుకు కాదు: తలసానిపై షబ్బీర్ అలీ ధ్వజం

టీఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. తలసాని సోదరుడు శంకర్ యాదవ్ బోయిన్ పల్లిలో ఉన్న ప్రాగ హౌసింగ్ సొసైటీ సభ్యులపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆ భూమి సత్యం రామలింగరాజుకు చెందినది అంటూ భూవివాదంలో శంకర్ యాదవ్ జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు. హౌసింగ్ సొసైటీ బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నది భూకబ్జాలు చేయడానికి, అమాయకులపై దాడులు చేసేందుకు కాదని అన్నారు.

More Telugu News