ఇతర రాష్ట్రాల్లో 'అమ్మ' మార్కెటింగ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇతర రాష్ట్రాల్లో 'అమ్మ' మార్కెటింగ్!

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 'అమ్మ' బ్రాండ్ పేరిట పలు రకాల చౌక ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టి విజయవంతమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోనూ, 'అమ్మ' ఉత్పత్తులను విక్రయించాలని ఆమె భావిస్తున్నారు. తొలుతగా 'అమ్మ ఉప్పు'ను దేశవ్యాప్తంగా మార్కెట్లో విడుదల చేయాలని కోరుకుంటున్నారు. ఏపీతో పాటు కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో అమ్మ ఉప్పును ప్రజలకు విక్రయించాలని తమిళనాడు సాల్ట్ బోర్డ్ అడుగులు వేస్తోంది. తమిళనాడులో అమ్మ ఉప్పుతో పాటు, అమ్మ సిమెంట్‌, అమ్మ మంచినీరు, అమ్మ క్యాంటీన్స్ వంటి అనేక పథకాలు అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇవన్నీ ప్రజల్లో మంచి పాప్యులారిటీని తెచ్చుకున్నాయి.

More Telugu News