అమ్మాయి మనసు ఎలా గెలుచుకోవాలో తెలుసా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమ్మాయి మనసు ఎలా గెలుచుకోవాలో తెలుసా?

అమ్మాయిల మనసు గెలుచుకోవాలని భావించని యువకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. అయితే చాలా మంది యువకులకు ఏం చేస్తే అమ్మాయిల మనసుల్లో స్థానం సంపాదించవచ్చో ఓ పట్టాన అర్థం కాదు. దీంతో చాలా మంది తమకు గర్ల్ ఫ్రెండ్స్ లేరని లేదా, అలాంటి వాటికి తాము దూరం అని చెబుతూ ఉంటారు. ఇకపై అలా చెప్పాల్సిన అవసరం లేదని, అమ్మాయిలను నవ్విస్తూ ఉండడం ఎలాగో నేర్చుకుంటే వారి మనసుల్లో చోటు సంపాదించవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. అమెరికాలో నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైందని పరిశోధకులు చెబుతున్నారు. ఎవరైనా అమ్మాయికి ఒకేసారి పరిచయమైన ఇద్దరబ్బాయిల్లో హాస్య చతురత ఎక్కువగా ఉండే వ్యక్తిని వారు ఇష్టపడుతున్నట్టు తేలింది. అతనితో డేటింగ్ కు వెళ్లేందుకు కూడా సదరు అమ్మాయిలు వెనుకాడడం లేదని సర్వే వెల్లడించింది. అబ్బాయిల్లో సెన్సాఫ్ హ్యూమర్ ను అమ్మాయిలు ఇష్టపడతారని, అలా నవ్వుతూ, నవ్వించే వారితో జీవితం ఆనందంగా ఉంటుందని భావిస్తున్నట్టు సర్వే వెల్లడించింది.

More Telugu News