Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆర్బీఐ హెడ్ ఆఫీస్ లో అగ్ని ప్రమాదం...ఐదో అంతస్తులో ఎగసిపడుతున్న మంటలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రధాన కార్యాలయంలో నేటి ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ముంబైలోని అర్బీఐ టవర్స్ లో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో భవనం ఐదో అంతస్తు నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 ఫైరింజన్లతో హుటాహుటిన అక్కడకు పరుగులు పెట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలక కేంద్రంగా ఉన్న ఆర్బీఐలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంపై సర్వత్ర ఆందోళన నెలకొంది. ప్రమాదంపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

More Telugu News