Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టాప్20లోకి ఎగబాకిన ఇషాంత్, పుజారా

శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ ను కైవసం చేసుకున్న భారత ఆటగాళ్లు తమ ర్యాంకింగ్స్ ను కూడా మెరుగుపరుచుకున్నారు. ఐసీసీ ప్రకటించిన తాజా టెస్ట్ ర్యాంకింగ్స్ ప్రకారం, బౌలర్ ఇషాంత్ శర్మ మూడు స్థానాలు ఎగబాకి 18వ ర్యాంకుకు చేరుకున్నాడు. అశ్విన్ 50వ స్థానంలో, అమిత్ మిశ్రా 59వ స్థానంలో ఉన్నారు. మరోవైపు, బ్యాట్స్ మెన్ చటేశ్వర్ పుజారా కూడా నాలుగు స్థానాలను మెరుగుపరుచుకుని 20వ స్థానంలో నిలిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక ర్యాంకు కోల్పోయి 11వ స్థానానికి పడిపోయాడు. రోహిత్ శర్మ రెండు స్థానాలు ఎగబాకి 48వ స్థానానికి చేరుకున్నాడు.

More Telugu News