బ్యాటింగ్ ఆర్డర్ లో నీ స్థానం ఏదంటే, ఎవరూ చెప్పలేరు: రోహిత్ శర్మ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బ్యాటింగ్ ఆర్డర్ లో నీ స్థానం ఏదంటే, ఎవరూ చెప్పలేరు: రోహిత్ శర్మ

అంతర్జాతీయ క్రికెట్ లో ఎవరైనా ఆటగాడిని బ్యాటింగ్ ఆర్డర్ లో నీ స్థానం ఏదని అడిగితే ఎవరూ చెప్పలేరని టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ తెలిపాడు. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఐదో స్థానంలో బ్యాటింగ్ కు దిగడంపై రోహిత్ ను అడిగిన ప్రశ్నకు స్పందించాడు. బ్యాటింగ్ ఆర్డర్ ఎవరి సొంతం కాదని, అందుకు తాను కూడా అతీతుడుని కాదని రోహిత్ స్పష్టం చేశాడు. జట్టు అవసరాలను బట్టి ఆటగాళ్లు ఆడాల్సి ఉంటుందని రోహిత్ తెలిపాడు. తానైనా, ఇంకో ఆటగాడైనా జట్టు అవసరాలను గుర్తించాల్సిన అవసరం ఉందని రోహిత్ చెప్పాడు. కోచ్, మేనేజ్ మెంట్ ఏ స్థానంలో ఆడమని చెబితే ఆ స్థానంలో ఆడాల్సి ఉంటుందని రోహిత్ తేల్చిచెప్పాడు. ఒక ఆటగాడి నుంచి జట్టు ఏం కోరుకుంటుంది? అనేది ఆటగాడు తెలుసుకోవాల్సి ఉంటుందని రోహిత్ స్పష్టం చేశాడు. కాగా, శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో కెప్టెన్ కోహ్లీ అత్యధిక పరుగులు సాధించగా, రోహిత్ రెండో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

More Telugu News