ఫిల్మ్ అసోసియేషన్ లో సభ్యత్వం పేరిట కోట్ల కుంభకోణం: నిర్మాత నట్టి కుమార్ ఆరోపణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫిల్మ్ అసోసియేషన్ లో సభ్యత్వం పేరిట కోట్ల కుంభకోణం: నిర్మాత నట్టి కుమార్ ఆరోపణ

ఫిల్మ్ అసోసియేషన్ లో సభ్యత్వం పేరిట భారీ కుంభకోణం జరిగిందని చిన్న సినిమా నిర్మాతల మండలి అధ్యక్షుడు నట్టి కుమార్ మండిపడ్డారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, ఫిల్మ్ అసోసియేషన్ లో సభ్యత్వం అంటూ 2 కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. ఈ కుంభకోణంలో ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ మాజీ అధ్యక్షుడు వీర్రాజు, ట్రెజరర్ ఎస్ఆర్కె రెడ్డి, మాజీ కార్యదర్శి రాజమాణిక్యం, ఈసీ మెంబర్ జగపతి రాధాకృష్ణ పాలుపంచుకున్నారని అన్నారు. సభ్యత్వం పేరిట వసూలు చేసిన సొమ్మును ఎగ్జిబిటర్స్ కు చెల్లించకుండా సొంత ఖాతాల్లో జమ చేసుకున్నారని తెలిపారు. అసోసియేషన్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, వారిపై పీడీ యాక్టు కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పది రోజుల్లో చర్యలు తీసుకోకుంటే హైకోర్టును ఆశ్రయిస్తానని నట్టి కుమార్ హెచ్చరించారు.

More Telugu News