Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కుప్పకూలిన వైకాపా మాజీ ఎమ్మెల్యే... ఐసీయూకు తరలింపు

వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ఏమయిందన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ రోజు వైకాపా చేపట్టిన బంద్ లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆయన బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో, మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా ఆయన ఒక్కసారిగా కూలిపోయారు.

More Telugu News