రూ. 125 నాణెం వచ్చేస్తోంది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రూ. 125 నాణెం వచ్చేస్తోంది!

అవును... మీరు చదివింది నిజమే. ఇండియాలో 125 రూపాయల నాణాలు చలామణిలోకి రానున్నాయి. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా, రూ. 125 నాణాలను తయారు చేసి విడుదల చేయాలని కేంద్రం భావిస్తోంది. ఏప్రిల్ 14, 1891న అంబేద్కర్ జన్మించగా, ఆయన 125వ జయంతి వేడుకలను 2016లో ఘనంగా జరపాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. సంవత్సరం పొడవునా ఆయనను గుర్తు చేసుకునే కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించిన బీజేపీ సర్కారు, అంబేద్కరుకు ఘన నివాళిగా భారత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ. 125 నాణాలను తయారు చేయాలని నిర్ణయించినట్టు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నాణెం ఎలా ఉండాలన్న విషయమై సాంఘిక సంక్షేమ శాఖతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అంబేద్కర్ బొమ్మ, రూపాయి చిహ్నం, మూడు సింహాల ముద్ర ఉంటాయని సమాచారం. దీంతో పాటు ప్రత్యేక పోస్టల్ స్టాంపునూ విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు.

More Telugu News