Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రపంచ అథ్లెటిక్స్ లో డిస్క్ త్రో ఫైనల్ కు చేరిన వికాస్ గౌడ

చైనా రాజధాని బీజింగ్ లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ డిస్క్ త్రోలో భారత్ క్రీడాకారుడు వికాస్ గౌడ ఫైనల్ కు చేరాడు. ఈ రోజు జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్ లో గ్రూప్-ఏలో 63.86 మీటర్లతో నాలుగో స్థానం సంపాదించాడు. దాంతో ఎల్లుండి జరగనున్న ఫైనల్స్ కు అర్హత సాధించాడు. డిస్క్ త్రోలో వికాస్ వ్యక్తిగత రికార్డు 66.28 మీటర్లుగా ఉంది. ఈ స్థాయిలో ప్రదర్శిస్తే స్వర్ణ పతకం సాధించే అవకాశాలున్నాయి.

More Telugu News