Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉగ్రవాదులుగా చేరండి లేదా సహాయం చేయండి: మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది పిలుపు

సామాజిక మాధ్యమాన్ని తీవ్రవాదులు సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు. ఉగ్రవాదుల వెబ్ సైట్లు, సామాజిక మాధ్యమాలపై నిఘా పెట్టామని చెబుతున్నప్పటికీ, వాటిని అధికారులు పూర్తిగా నిరోధించలేకపోతున్నారు. తాజాగా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది బుర్హాన్ వాని సోషల్ మీడియా ద్వారా యువతకు పిలుపునిచ్చాడు. జమ్మూకాశ్మీర్ లో హిజుబుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలో చేరాలని కోరాడు. లేదా సహాయం చేయాలని సూచించాడు. కాగా, బుర్హాన్ వాని జమ్మూకాశ్మీర్ పోలీసుల మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న వ్యక్తి, అతని తలపై 10 లక్షల నజరానా కూడా ఉంది. కాగా, అతని ఫేస్ బుక్ పేజ్ ఆపాలంటూ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా, బుర్హాన్ వాని జమ్మూకాశ్మీర్ హిజుబుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ గా పనిచేస్తున్నాడు.

More Telugu News