స్మార్ట్ సిటీల జాబితా విడుదల చేసిన వెంకయ్యనాయుడు... ఏపీలో 3 ఆకర్షణీయ నగరాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్మార్ట్ సిటీల జాబితా విడుదల చేసిన వెంకయ్యనాయుడు... ఏపీలో 3 ఆకర్షణీయ నగరాలు

దేశంలో ఎంపిక చేసిన స్మార్ట్ సిటీల (ఆకర్షణీయ నగరాల) జాబితా విడుదలైంది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు 98 స్మార్ట్ సిటీల జాబితాను ప్రకటించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 98 నగరాల్లో 13 కోట్ల జనాభా ఉందని తెలిపారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 13, తమిళనాడులో 12, మధ్యప్రదేశ్ లో 7, గుజరాత్ , కర్ణాటక నుంచి 6 నగరాలు, ఏపీలో మూడు, బీహార్ లో కూడా 3 స్మార్ట్ నగరాలను ఎంపిక చేసినట్టు వెంకయ్య వివరించారు. ఇక తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ స్మార్ట్ సిటీగా ఎంపికైందన్నారు. రాబోయే ఆరేళ్లలో స్మార్ట్ నగరాల అభివృద్ధి కోసం రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు. ప్రతి స్మార్ట్ సిటీకి ఏడాదికి రూ.100 కోట్లు ఇస్తామన్నారు. కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర నిధులతో స్మార్ట్ సిటీల అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.

More Telugu News