పవన్ కల్యాణ్ తో జగన్ కు పోలికేంటి?: ఏపీ మంత్రి పల్లె
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవన్ కల్యాణ్ తో జగన్ కు పోలికేంటి?: ఏపీ మంత్రి పల్లె

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో వైకాపా అధ్యక్షుడు జగన్ కు పోలికేమిటని ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రశ్నించారు. రైతుల మీద పవన్ కల్యాణ్ కు ఉన్నది నిజమైన ప్రేమ అని... జగన్ ది కుట్రపూరిత రాజకీయమని అన్నారు. జగన్ కు సీఎం కుర్చీపై ప్రేమే తప్ప, రైతులపై ఏ మాత్రం ప్రేమలేదని మండిపడ్డారు. పవన్ తో జగన్ ను పోల్చకండని మీడియా ప్రతినిధులను కూడా పల్లె కోరారు. మరోవైపు, ఏపీకి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, జగన్ లకు ఉన్నది కపట ప్రేమే అని తెలిపారు.

More Telugu News