ఉపాధ్యాయుడి అవతారమెత్తనున్న రాష్ట్రపతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉపాధ్యాయుడి అవతారమెత్తనున్న రాష్ట్రపతి

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉపాధ్యాయుడి అవతారమెత్తనున్నారు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం పుస్కరించుకుని ఢిల్లీలోని ఓ పాఠశాల విద్యార్థులకు ఆయన పాఠాలు బోధించనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య సరైన సంబంధాలు నెలకొనడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీచర్ గా మారనుండడం విశేషం. సెప్టెంబర్ నాలుగు సాయంత్రం రాష్ట్రపతి భవన్ కు సమీపంలో ఉండే సర్వోదయ విద్యాలయ పాఠశాలలో ఏడు, ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఆయన పాఠాలు బోధించనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆహ్వానం మేరకు ఆయన పాఠాలు బోధించనున్నారు.

More Telugu News