ఐసీసీ టెస్టు ర్యాంకిగ్స్... కోహ్లీ అవుట్... అశ్విన్ ఇన్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐసీసీ టెస్టు ర్యాంకిగ్స్... కోహ్లీ అవుట్... అశ్విన్ ఇన్!

టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ శ్రీలంక సిరీస్ లో ఆకట్టుకోని ఆటతీరుతో ఐసీసీ టెస్టు ర్యాంకిగ్స్ లో దిగజారాడు. తాజా సిరీస్ కు ముందు టాప్ టెన్ లో చోటు దక్కించుకున్న కోహ్లీ, శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల తరువాత 11వ స్థానానికి దిగజారాడు. బంగ్లాదేశ్, శ్రీలంక టెస్టు సిరీస్ లో విశేషంగా రాణించి సీనియర్ల మన్ననలందుకున్న రవిచంద్రన్ అశ్విన్ టెస్టు బౌలర్లలో 8వ స్థానంలో నిలవగా, ఆల్ రౌండర్లలో 2వ ర్యాంకులో ఉన్నాడు. దీంతో రెండు విభాగాల్లో టాప్ 10లోపు ర్యాంకుల్లో అశ్విన్ కొనసాగుతున్నాడు. 22వ ర్యాంకులో ఉన్న రహానే శ్రీలంక సిరీస్ లో సెంచరీ తరువాత రెండు స్థానాలు ఎగబాకి 20వ ర్యాంకు సంపాదించాడు. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లో మూడేసి వికెట్లతో రాణించిన మిస్టరీ స్పిన్నర్ అమిత్ మిశ్రా 42 స్థానాలు మెరుగుపరుచుకుని, 39వ ర్యాంకుకు చేరుకున్నాడు.

More Telugu News