మోదీతో కేజ్రీ భేటీ... చంద్రబాబు బయటకు రాగానే లోపలికెళ్లిన ఢిల్లీ సీఎం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోదీతో కేజ్రీ భేటీ... చంద్రబాబు బయటకు రాగానే లోపలికెళ్లిన ఢిల్లీ సీఎం

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొద్దిసేపటి క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలపై ఆ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రధానితో దాదాపు గంటన్నర పాటు సమావేశమయ్యారు. ఈ భేటీ జరుగుతుండగానే అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని అధికార నివాసానికి చేరుకున్నారు. మోదీతో భేటీ ముగించుకుని చంద్రబాబు బయటకు రాగానే వెనువెంటనే కేజ్రీవాల్ లోపలికి వెళ్లారు. ప్రధానితో కేజ్రీవాల్ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News