Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి బాబూమోహన్ కౌన్సెలింగ్... భావోద్వేగంతో కంటతడి

హైదరాబాద్ లో గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లో డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారికి సినీ నటుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబూమోహన్ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ సమయంలో రోడ్డు ప్రమాదంలో కొన్నేళ్ల కిందట చనిపోయిన తన పెద్ద కొడుకు పవన్ కుమార్ ను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. తాగడం తప్పు కాదని, తాగి డ్రైవింగ్ చేయడం తప్పని, కుటుంబాలను అనాథలను చేయవద్దని కోరారు. తాగి చనిపోతే పరువు పోతుందని, అందుకే ప్రమాదాల బారిన పడవద్దని వారికి చెప్పారు.

More Telugu News