గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ నరసింహన్... గ్రామ సమస్యలపై ఆరా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ నరసింహన్... గ్రామ సమస్యలపై ఆరా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమంలో ఈరోజు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కిషన్ నగర్ గ్రామంలో జరిగిన ఆ కార్యక్రమంలో గ్రామ సమస్యలను సర్పంచి, కమిటీ సభ్యులను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. అంగన్ వాడీ కేంద్రంలో పౌష్టికాహారానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో విద్యార్థులతోనూ గవర్నర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే అంజయ్య, పలువురు అధికారులు పాల్గొన్నారు.

More Telugu News