Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ట్విట్టర్లో జెఠ్మలానీ వ్యాఖ్యలు పోస్టు చేసిన పవన్... దేనికి సంకేతం?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీతో చెలిమికి గుడ్ బై చెప్పనున్నారా? అన్న ఊహాగానాలకు ఆయన తాజా ట్వీట్ బలం చేకూరుస్తోంది. షూటింగ్ రద్దు చేసుకుని హైదరాబాదు చేరుకున్న పవన్ ఓ ట్వీట్ తో తనలో పెల్లుబుకుతున్న ఆవేశాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. సొంత అభిప్రాయానికి బదులు విఖ్యాత న్యాయవాది రామ్ జెఠ్మలానీ కామెంట్లను ట్విట్టర్లో పోస్టు చేశారు. "ఓ రాజకీయ పార్టీ జాతి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నంత కాలం దానికి మద్దతివ్వడం ధర్మం. అయితే, ఆ రాజకీయ పార్టీ విధానాలు, చర్యలు జాతికి నష్టం కలిగిస్తున్నప్పుడు కూడా ఆ పార్టీకి మద్దతివ్వడం జాతికి ద్రోహం తలపెట్టడంతో సమానం. రాజకీయాల్లో ఎల్లప్పుడూ జాతి ప్రయోజనాలే పరమావధిగా ఉండాలి" అన్న రామ్ జెఠ్మలానీ అభిప్రాయాలను పవన్ ట్విట్టర్లో పోస్టు చేశారు. దీన్నిబట్టి చూస్తుంటే పవన్ కల్యాణ్ ఏపీలో అధికార టీడీపీతో పోరాటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

More Telugu News