Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జనగాంలో కిక్-2 సినిమాకు అంతరాయం... తెరను చించేసిన ఫ్యాన్స్

మాస్ మహారాజా రవితేజ తాజా సినిమా కిక్-2 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా, వరంగల్ జిల్లా జనగాంలోని దేవీ థియేటర్ లో కిక్-2 సినిమా ప్రదర్శనకు మధ్యలో అంతరాయం కలిగింది. దాంతో, ఫ్యాన్స్ వీరంగం వేశారు. తెరను చించివేసి, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. సాంకేతిక కారణాల వల్లే ప్రదర్శనకు అంతరాయం కలిగిందని థియేటర్ సిబ్బంది నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా అభిమానులు శాంతించలేదు. ఆగ్రహంతో ఊగిపోయారు.

More Telugu News