పవన్ కల్యాణ్ పై టీడీపీ నేతల ముప్పేట దాడి... సోమిరెడ్డి వంతూ వచ్చేసింది
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవన్ కల్యాణ్ పై టీడీపీ నేతల ముప్పేట దాడి... సోమిరెడ్డి వంతూ వచ్చేసింది

జనసేన అధినేత, టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కల్యాణ్ పై టీడీపీ నేతలు ముప్పేట దాడి కొనసాగిస్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం అవసరమైన భూమి సేకరణకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తప్పుబడుతున్న పవన్ కల్యాణ్ పై తొలుత కాస్తంత సాఫ్ట్ గానే వ్యవహరించిన టీడీపీ, ఆ తర్వాత మాటల తూటాలను పేలుస్తోంది. భూసేకరణ చట్టం ప్రయోగంపై పవన్ కల్యాణ్ కు సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదని హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప ప్రకటించిన కొద్దిసేపటికే ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. రాజధాని భూ సేకరణకు సంబంధించి అధ్యయనం చేసిన తర్వాత పవన్ కల్యాణ్ మాట్లాడితే బాగుంటుందని కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించారు. మొత్తం వ్యవహారాన్ని స్టడీ చేసిన తర్వాత పవన్ కల్యాణ్ సలహాలిస్తే స్వీకరించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని చెప్పిన సోమిరెడ్డి, పవన్ కల్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

More Telugu News