తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్పులివే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్పులివే!

వచ్చ నెల 16 నుంచి 24 వరకూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో తిరుమలలో దర్శనం, ఆర్జిత సేవలు, ప్రయాణికుల సౌకర్యాలు తదితర విషయాల్లో మార్పు చేర్పులు చేస్తున్నట్టు ఈఓ సాంబశివరావు వెల్లడించారు. ఈ ఉదయం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించిన ఆయన, పరిమిత సంఖ్యలోనే వీఐపీ భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. సాధ్యమైనంత ఎక్కువ సేపు స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని అన్నారు. గరుడోత్సవం రోజున వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్టు వివరించారు. బ్రహ్మోత్సవాలు జరిగినన్ని రోజులూ 24 గంటల పాటు కనుమ రహదారుల్లో వాహనాల రాకపోకలకు అనుమతిస్తామని ఆయన తెలిపారు. అన్ని రకాల ఆర్జిత సేవలనూ రద్దు చేశామని, భక్తుల కోసం 6 లక్షల లడ్డూలను సిద్ధం చేయనున్నామని ఆయన అన్నారు. శ్రీవారి పుష్కరిణి మరమ్మతు పనులు తుది దశకు వచ్చాయని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు భద్రత కోసం కొత్తగా 300 సీసీ కెమెరాలను అమర్చనున్నామని వివరించారు.

More Telugu News