ఛత్తీస్ గఢ్ లో మావోల పంజా... సీఐఎస్ఎఫ్ బలగాలపై దాడి... హోరాహోరీ కాల్పులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఛత్తీస్ గఢ్ లో మావోల పంజా... సీఐఎస్ఎఫ్ బలగాలపై దాడి... హోరాహోరీ కాల్పులు

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు మరోమారు పంజా విసిరారు. రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా బచేలి వద్ద కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ ఆధ్వర్యంలోని గనులపై నిన్న రాత్రి ముప్పేట దాడి చేశారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో అన్ని వైపుల నుంచి గనులను చుట్టుముట్టిన మావోలను అక్కడ భద్రతా విధులను పర్యవేక్షిస్తున్న సీఐఎస్ఎఫ్ బలగాలు సమర్థవంతంగానే ఎదుర్కొన్నాయి. రాత్రి 11 గంటల నుంచి 2 గంటల దాకా ఇరు వర్గాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. సీఐఎస్ఎఫ్ బలగాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైన నేపథ్యంలో మావోలు ఎన్ఎండీసీకి చెందిన పలు వాహనాలు, యంత్ర సామగ్రికి నిప్పు పెట్టారు. దీంతో రూ.50 కోట్ల మేర విలువ చేసే ఎన్ఎండీసీ పరికరాలు అగ్నికి ఆహుతైనట్లు సమాచారం.

More Telugu News