మిత్రదేశంపై అమెరికా గూఢచర్యం... బాంబు పేల్చిన 'వికీలీక్స్'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మిత్రదేశంపై అమెరికా గూఢచర్యం... బాంబు పేల్చిన 'వికీలీక్స్'

అగ్రరాజ్యం అమెరికాకు చెందిన మరికొన్ని రహస్యాలను వికీలీక్స్ వెల్లడించింది. జపాన్ ప్రభుత్వంపైనా, ఆ దేశానికి చెందిన పలు సంస్థలపైనా అమెరికా గూఢచర్యానికి పాల్పడిందని వికీలీక్స్ పేర్కొంది. ప్రభుత్వ పెద్దలపైనే కాకుండా ఓ అగ్రశ్రేణి సెంట్రల్ బ్యాంకుపైనా, మిత్సుబిషి వంటి దిగ్గజ సంస్థలపైనా అమెరికా వర్గాలు గూఢచర్యానికి పాల్పడ్డాయని తెలిపింది. అమెరికా నిఘా ఎంత లోతైనదో ఈ వివరాలతో అర్థమవుతోందని, గూఢచర్యం ద్వారా సేకరించిన వివరాల్లో వ్యాపార, వాతావరణ, దౌత్య, అణుశక్తి సంబంధమైన అంశాలున్నాయని పేర్కొంది. కాగా, అమెరికాకు జపాన్ మిత్రదేశమన్న సంగతి తెలిసిందే. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు జపాన్ చేదోడువాదోడుగా ఉంటోంది. రక్షణ, ఆర్థిక, వాణిజ్య రంగ అంశాల్లో ఇరుదేశాల మధ్య నిరంతరం సంప్రదింపులు జరుగుతుంటాయి. అలాంటి మిత్రదేశంపైనే అమెరికా గూఢచర్యానికి పాల్పడిందని వికీలీక్స్ తెలిపింది. కాగా, వికీలీక్స్ తాజా ప్రకటనపై జపాన్ స్పందన తెలియరాలేదు.

More Telugu News