ఫ్లిప్ కార్ట్ కొత్త రూటు... సెల్ఫ్ పికప్ స్టోర్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫ్లిప్ కార్ట్ కొత్త రూటు... సెల్ఫ్ పికప్ స్టోర్లు!

సాధ్యమైనంత మంది ఎక్కువ కస్టమర్లను ఆకర్షించి వ్యాపారం పెంచుకోవడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్న ఈ-కామర్స్ సేవల సంస్థ ఫ్లిప్ కార్ట్, మరో వ్యూహంతో ముందుకు వచ్చింది. ఆన్ లైన్లో ఆర్డర్ బుక్ చేసుకున్న తరువాత రోజుల తరబడి వేచిచూసే అవసరం లేకుండా, వెంటనే వెళ్లి వస్తువును తెచ్చుకునే సౌకర్యాన్ని దగ్గర చేసింది. ఈ దిశగా సెల్ఫ్ పికప్ స్టోర్లను ప్రారంభించినట్టు సంస్థ సీనియర్ డైరెక్టర్ నీరజ్ అగర్వాల్ వివరించారు. కస్టమర్లు తమకు అనువైన సమయంలో ఈ స్టోర్లకు వెళ్లి తాము ఆర్డరిచ్చిన ప్రొడక్టులను తీసుకువెళ్లవచ్చని తెలిపారు. దేశవ్యాప్తంగా 20 సెల్ఫ్ పికప్ స్టోర్లను ప్రారంభించామని, ప్రత్యామ్నాయ డెలివరీ మోడల్ గా ఇది పనిచేస్తుందని అన్నారు. ఐటీ పార్కులు, గేటెడ్ కమ్యూనిటీలు, విద్యా సంస్థలు తదితరాల్లోకి డెలివరీ బాయ్స్ వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని, దీనివల్ల కస్టమర్లకూ అసంతృప్తి కలుగుతోందని ఆయన గుర్తు చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకే ఈ తరహా ఆలోచన చేసినట్టు నీరజ్ వివరించారు. త్వరలోనే స్పాట్ ట్రయల్స్, ఓపెన్ బాక్స్ డెలివరీ, ప్రొడక్టు డెమో, నచ్చకుంటే అప్పటికప్పుడు వెనక్కు తీసుకోవడం వంటి సేవలను అందిస్తామని తెలిపారు. మార్చి నాటికి 100కు పైగా సెల్ఫ్ పికప్ స్టోర్లు ప్రారంభిస్తామని వివరించారు.

More Telugu News