Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇకపై ప్రముఖ వ్యక్తుల చిత్రాలతో కూడా స్టాంపులు

ఇంతవరకు ఎందరో సంఘసంస్కర్తలు, రాజకీయ నాయకుల చిత్రాలతో ముద్రించిన స్టాంపులను ప్రభుత్వం విడుదల చేసేది. ఇకపై ప్రముఖ వ్యక్తులైన స్వాతంత్ర్య సమరయోధులు, చిత్రకారులు, రచయితలు, గాయకుల చిత్రాలతో కూడా స్టాంపులు ముద్రించి విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు కేంద్ర చాంపియన్ షిప్ ఆఫ్ కమ్యూనికేషన్, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో సమావేశమైన స్టాంపుల సలహా కమిటీ చర్చించింది. ఆ తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం స్టాంపుల డిజైన్లను ప్రజల నుంచి కూడా సేకరించాలని అనుకుంటోంది. అదే క్రమంలో ప్రముఖుల చిత్రాలతో ముద్రించిన స్టాంపులను తాజ్ మహల్, అజంతా, ఎల్లోరా, బెలూర్ మఠ్, ఖజరహో వంటి పర్యాటక స్థలాల వద్ద విడుదల చేయాలని భావిస్తున్నారు. 'స్వచ్ఛ భారత్' పేరుతో ఇతివృత్తాన్ని ముద్రించిన తపాలా శాఖ జనవరి 30న స్టాంపులను ఇప్పటికే విడుదల చేసింది. ఇలాగే మహిళా సాధికారత గౌరవార్థంగా ఓ స్టాంపును ఆగస్టు 15న విడుదల చేయనున్నారు. స్టాంపులపై ప్రకటించే ప్రతి సమాచారం ప్రజలకు చేరేలా ఒక మొబైల్ యాప్ ను కూడా రూపొందించాలని భావిస్తున్నట్టు మంత్రి ప్రసాద్ చెప్పారు.

More Telugu News