Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కలాం కన్నుమూసినా కొనసాగనున్న ట్విట్టర్ ఖాతా

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం భౌతికంగా లేకపోయినా ఆయన ట్విట్టర్ ఖాతా మాత్రం యాక్టివ్ గా ఉండనుంది. అయితే కొత్త పేరుతో ఖాతాను కొనసాగించాలని ఆయనతో సన్నిహితంగా ఉండే సహాయకుల బృందం నిర్ణయించింది. 'ఇన్ మెమొరీ ఆఫ్ డాక్టర్ కలాం' పేరుతో ట్విట్టర్ ఖాతా కొనసాగుతుందని ఆయనకు సన్నిహితంగా ఉండే ఐఐఎం పూర్వ విద్యార్థి, సహచరుడు శ్రిజన్ పాల్ సింగ్ ట్విట్టర్ లో తెలిపారు. ఈ అకౌంట్ ద్వారా డాక్టర్ కలాం జ్ఞాపకాలను, స్పూర్తిదాయక సందేశాలను, ఉపన్యాసాలను శ్రిజన్ పాల్ ట్వీట్ చేయనున్నారు. అంతేగాక కలాం పుస్తకాలు 'వింగ్స్ ఆఫ్ ఫైర్','ఇండియా 2020','ఇగ్నిటెడ్ మైండ్స్', 'అనదర్ బుక్', 'అడ్వాంటేజ్ ఇండియా' తదితర పుస్తకాల్లో ముఖ్య వ్యాఖ్యలను ట్విట్టర్ లో ఉంచనున్నారట.

More Telugu News