విద్యార్థుల్లో స్ఫూర్తి నింపుతూ కుప్పకూలిన అబ్దుల్ కలాం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విద్యార్థుల్లో స్ఫూర్తి నింపుతూ కుప్పకూలిన అబ్దుల్ కలాం

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆరోగ్యపరిస్థితి విషమించింది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లోని ఐఐఎంలో ప్రసంగిస్తూ ఆయన కుప్పకూలారు. అకస్మాత్తుగా ఆయన కుప్పకూలడంతో అక్కడ ఆందోళన నెలకొంది. అధికారులు ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, విద్యార్థుల్లో స్ఫూర్తి రగిలించడాన్ని ఇష్టపడే కలాం, అదే పనిలో నిమగ్నమై కుప్పకూలడంతో దేశం యావత్తూ ఆందోళనలో మునిగిపోయింది.

More Telugu News