మన దేశంలో రోజుకు ఎంత మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారో తెలుసా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మన దేశంలో రోజుకు ఎంత మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారో తెలుసా?

మన దేశంలో రోజుకు ఎంత మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారో తెలుసా? జాతీయ నేర గణాంక శాఖ చెబుతున్న లెక్కల ప్రకారం...భారత్ లో రోజూ 360 మంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇందులో 84 మంది కుటుంబ సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, 69 మంది మానసిక సమస్యలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. 11 మంది ప్రేమ విఫలమై ఉసురు తీసుకుంటున్నారు. నిరుద్యోగ సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఆరుగురు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఐదుగురు వరకట్న వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. వీరిని కాపాడడం కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితుల చేతుల్లోనే ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆత్మహత్యకు పాల్పడేవారిని గమనిస్తూ, వారిలో మనోధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత కుటుంబ సభ్యుల చేతుల్లోనే ఉందని వారు పేర్కొంటున్నారు.

More Telugu News