Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పుష్కరాల్లో విధులు నిర్వహించిన ఉద్యోగులకు సెలవులు ప్రకటించిన కేసీఆర్

గోదావరి పుష్కరాల్లో విధులు నిర్వహించిన తెలంగాణ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ సెలవులు ప్రకటించారు. ఈనెల 14 నుంచి 25వరకు పుష్కరాలు జరుగుతున్నాయి. అంటే రేపటితో పుష్కరాలు ముగియనున్నాయి. ఆ వెంటనే అంటే 27, 28 తేదీల్లో ఉద్యోగులకు సెలవు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారి వచ్చిన గోదావరి పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ప్రమాదాలు, ఇబ్బందులు కలగకుండా చూసినందుకు ఉద్యోగులందరికీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

More Telugu News