Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాహుల్ పర్యటనలో అస్వస్థతకు గురైన సుబ్బరామిరెడ్డి... హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు

అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన రైతు భరోసా యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. సీనియర్ నేత సుబ్బరామిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. రాహుల్ పాదయాత్రలో నడవలేక ఆయన కుప్పకూలిపోయారు. వాస్తవానికి ఆయన వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఈ సమయంలో, ఆయన పాదయాత్రలో పాల్గొనడంతో, ఆయనకు నొప్పి ఎక్కువైంది. దీంతో, వెంటనే ఆయనను అంబులెన్సులో పడుకోబెట్టి... పుట్టపర్తిలోని ఆసుపత్రికి తరలించారు.

More Telugu News