Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా ప్రాణాలు కాపాడండి, లేదా ఆత్మహత్యకు అనుమతించండి!: రాష్ట్రపతికి మధ్యప్రదేశ్ మెడికోల వేడుకోలు

మధ్యప్రదేశ్ లో సంచలనం సృష్టించిన వ్యాపమ్ కుంభకోణంలో నిందితులుగా ఉన్న ఐదుగురు మెడికల్ విద్యార్థులు తమ ప్రాణాలకు ముప్పు ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ను ఆశ్రయించారు. వీరంతా మెడికల్ ఎంట్రెన్స్ పరీక్షలో అవకతవకలకు పాల్పడ్డారన్నది అభియోగం. గ్వాలియర్ కు చెందిన మనీష్ శర్మ, రాఘవేంద్ర సింగ్, పంకజ్ బన్సాల్, అమిత్ చద్దా, వికాస్ గుప్తలు రాష్ట్రపతికి లేఖను రాస్తూ, తమ ప్రాణాలను కాపాడాలని, లేకుంటే ఆత్మహత్యకు అనుమతించాలని కోరారు. ఈ కుంభకోణంలో తమ ప్రమేయం లేదని సిట్ తేల్చినప్పటికీ, కాలేజీ అధికారులు తమను వేధిస్తూనే ఉన్నారని ఆరోపించారు. తాము నరకంలో ఉన్నట్టు భావిస్తున్నామని తెలిపారు. కేసులో నిందితులు, విచారణ జరుపుతున్న అధికారులు మరణిస్తుండటం తమలో భయాన్ని పెంచుతోందని పేర్కొన్నారు. ఈ కేసులో కల్పించుకోవాలని ప్రణబ్ ను కోరారు. కాగా, వీరు చదువుతున్న కాలేజీలోనే రమణేంద్ర సింగ్ అనే వ్యాపమ్ నిందితుడు అనుమాస్పద స్థితిలో మరణించాడు.

More Telugu News