'కిషన్ జీ'ని మేమే చంపేశాం... అంటూ మమతా బెనర్జీని చిక్కుల్లోకి నెట్టిన మేనల్లుడు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆమె మేనల్లుడు చిక్కుల్లోకి నెట్టాడు. వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా మమత దీదీని ఎప్పటికప్పుడు చిక్కుల్లోకి నెడుతున్నాడు. మావోయిస్టు అగ్రనేత కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీని తమ ప్రభుత్వమే చంపేసిందని సీఎం మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యానించి కలకలం రేపారు. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా బెల్పహారి జిల్లాలో జరిగిన బహిరంగ సభలో అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ, కిషన్ జీని చంపడం ద్వారా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని నిరూపించుకుందని అన్నారు.
2011లో అక్టోబర్ లో బెంగాల్ లోని మిడ్నాపూర్ జిల్లాలోని బురిసోల్ గ్రామం సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత కిషన్ జీ మరణించారని ఇంతకాలం మమతా బెనర్జీ ప్రభుత్వం వాదిస్తోంది. ఆయన ఎన్ కౌంటర్ కు, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మమతా వాదిస్తూ వచ్చారు.