విజయవాడలో నరరూప రాక్షసుడు... కొడుకు, భార్య, అత్తలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన వైనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయవాడలో నరరూప రాక్షసుడు... కొడుకు, భార్య, అత్తలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన వైనం

ఏపీ రాజకీయ రాజధానిగా రూపుదిద్దుకుంటున్న విజయవాడలో కొద్దిసేపటి క్రితం దారుణం చోటుచేసుకుంది. కన్న కొడుకు, కట్టుకున్న భార్య, పిల్లనిచ్చిన అత్తలను నిలువునా తగలబెట్టేందుకు ఓ దుర్మార్గుడు యత్నించాడు. ముగ్గురిపై పెట్రోల్ పోసి నిప్పు పుట్టాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన బాధితులను స్థానికులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘాతుకానికి పాల్పడ్డ ఆ దుర్మార్గుడు పరారీలో ఉన్నాడు.

More Telugu News