భద్రాచలంలో మంత్రి జగదీశ్ రెడ్డిని అడ్డుకున్న భక్తులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భద్రాచలంలో మంత్రి జగదీశ్ రెడ్డిని అడ్డుకున్న భక్తులు

తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డిని భద్రాచలంలో భక్తులు అడ్డుకున్నారు. ప్రొటోకాల్ పేరుతో తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ భద్రాచలం ఆలయం వద్ద భక్తులు ఆందోళనకు దిగారు. సర్ది చెప్పేందుకు ఆ సమయంలో అక్కడకు వచ్చిన మంత్రిని, ఆలయ సిబ్బందిని భక్తులు అడ్డుకున్నారు. దర్శనం చేసుకోనివ్వకుండా తమను ప్రొటోకాల్ పేరుతో ఆపడం తగదని నిలదీశారు. దాంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. అధికారులపై మండిపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

More Telugu News