మునిసిపల్ కార్మికుల సమ్మెకు మద్దతు ఎఫెక్ట్... చాడా, తమ్మినేని అరెస్ట్!
తెలంగాణలో మునిసిపల్ కార్మికుల సమ్మె మరింత తీవ్రరూపం దాల్చింది. దాదాపు వారానికిపైగా విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలుపుతూ వామపక్ష పార్టీలు నేడు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చాయి. ఆందోళనలో భాగంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంలు నేటి ఉదయం రోడ్లపైకి వచ్చారు. హైదరాబాదులోొ ఆర్టీసీ బస్సులను డిపోల నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిద్దరితో పాటు పెద్ద సంఖ్యలో వామపక్ష నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.