గూగుల్ 'బై' బటన్ వచ్చేసింది... ఇకపై ఆన్ లైన్ కొనుగోళ్లు మరింత సులభం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గూగుల్ 'బై' బటన్ వచ్చేసింది... ఇకపై ఆన్ లైన్ కొనుగోళ్లు మరింత సులభం!

ఆన్ లైన్ షాపింగ్ అనుభూతిని మరింతగా పెంచుతూ, సరికొత్త 'బై' బటన్ ను గూగుల్ ప్రవేశపెట్టింది. "పర్చేజస్ ఆన్ గూగుల్" పేరిట అందే ఈ సేవల్లో భాగంగా, ఏవైనా వ్యాపార ప్రకటనలు చూసే సమయంలో వాటిని కొనుగోలు చేయాలని భావిస్తే, 'బై' బటన్ నొక్కితే, సదరు ప్రొడక్ట్ పేజీకి డైరెక్ట్ గా వెళ్లిపోయి, దాన్ని కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ను కొద్దిమంది రిటెయిలర్లతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా పరీక్షిస్తున్నామని, నెటిజన్ల నుంచి వచ్చే స్పందన బట్టి మరింతగా విస్తరిస్తామని గూగుల్ ప్రకటించింది. వినియోగదారులు మరింత సమయాన్ని స్మార్ట్ ఫోన్లపై గడుపుతున్నందున లొకేషన్ ఆధారిత సాంకేతిక సేవలను విస్తృతం చేయనున్నామని వివరించింది. వ్యాపార ప్రకటనలతో పాటే ప్రొడక్టు రేటింగ్, దగ్గర్లో ఎక్కడ లభిస్తాయన్న సమాచారాన్ని సైతం అందిస్తామని గూగుల్ తన బ్లాగులో పెట్టిన పోస్టులో వెల్లడించింది. గూగుల్ క్రోమ్ మాధ్యమంగా ఆండ్రాయిడ్ సేవలను పొందుతున్న వారికి ఈ అదనపు సమాచారం అందుబాటులో ఉంటుందని, ఐఓఎస్ ఆధారిత సిస్టమ్స్ లో త్వరలోనే ఈ సదుపాయాన్ని అందిస్తామని వివరించింది.

More Telugu News