Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మొబైల్ విప్లవాన్ని గుర్తించలేకపోయాం... అది చారిత్రక తప్పిదమేనన్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల

టెక్నాలజీ రంగంలో ప్రపంచ అగ్రగామి సంస్థగా ఎదిగిన మైక్రోసాఫ్ట్ కూడా చారిత్రక తప్పిదం చేసిందట. భవిష్యత్తు అంతా పర్సనల్ కంప్యూటర్లదేనని లెక్కలు కట్టిన ఆ సంస్థ, మొబైల్ ఫోన్ విప్లవాన్ని గుర్తించడంలో ఘోరంగా విఫలమైందట. తద్వారా తమ సంస్థ చారిత్రక తప్పిదం చేసిందని ఆ సంస్థ సీఈఓ, తెలుగు తేజం సత్య నాదెళ్ల నిన్న ఆసక్తికర వ్యాఖ్య చేశారు. 90వ దశకంలో తాను మైక్రోసాఫ్ట్ లో చేరేనాటికి పర్సనల్ కంప్యూటర్ల హవా నడుస్తోందని ఆయన అన్నారు. ప్రతి ఇంటిలో పీసీ ఉండాలన్న ఏకైక లక్ష్యంతోనే నాడు ముందుకెళ్లామని, ఈ కారణంగానే సంస్థ మొబైల్ ఫోన్ రంగంపై దృష్టి సారించలేకపోయిందని కూడా ఆయన అన్నారు. అయితే భవిష్యత్తులోనూ మొబైల్ ఫోనే రాజ్యమేలుతుందని చెప్పలేమని సత్య నాదెళ్ల అన్నారు. అలా భావిస్తే, మరోమారు చారిత్రక తప్పిదం చేసినట్లే అవుతుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు.

More Telugu News