Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

12 ఏళ్ల చదువుతోనే ఉద్యోగాలు రావు: కేంద్ర మంత్రి

కేవలం 12 ఏళ్ల చదువుతోనే ఉద్యోగాలు రావని కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ తెలిపారు. ఢిల్లీలో 'ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన' కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నైపుణ్యంలో 12 వారాల శిక్షణతో ఉద్యోగం లభిస్తుందని అన్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా పరిశ్రమల్లో యువతకు ఉద్యోగాలు సులువుగా లభిస్తాయని ఆయన చెప్పారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం ప్రత్యేక యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. నైపుణ్యాభివృద్ధితో యువతలో నిరుద్యోగ సమస్యను పారద్రోల వచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. శిక్షణ పూర్తయిన తరువాత నైపుణ్యతా పత్రం అందజేసి, యువతకు రుణాలు అందేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

More Telugu News