మహీంద్రా అధినేతలో కుతూహలం రేపిన రాజమౌళి దర్శకత్వ ప్రతిభ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహీంద్రా అధినేతలో కుతూహలం రేపిన రాజమౌళి దర్శకత్వ ప్రతిభ

ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందిన 'బాహుబలి' చిత్రం అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంటోంది. సినీ నటులే కాదు, రాజకీయ ప్రముఖులు కూడా జక్కన్న మ్యాజిక్ కు ఫిదా అయిపోయారు. తాజాగా, పారిశ్రామిక దిగ్గజం, మహీంద్రా గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ ఆనంద్ మహీంద్రాను కూడా రాజమౌళి దర్శకత్వ ప్రతిభ ఆకట్టుకున్నట్టు అర్థమవుతోంది. తాజాగా, ఆనంద్ 'బాహుబలి' బాగుందని మెచ్చుకున్నారు. రెండో భాగం కోసం ఆగలేకపోతున్నానని పేర్కొన్నారు. హాలీవుడ్ చిత్రాలకు అనుకరణగా అనిపించడం లేదని, ఫక్తు భారతీయ చిత్రమని కొనియాడారు. సమ్మోహితుల్ని చేసే సంగీతం, క్రియేటివ్ రొమాంటిక్ సీన్లు ఈ సినిమాను భిన్నంగా నిలిపాయన్నారు. వెండితెరపై భారతీయ పౌరాణిక, జానపద చిత్రాల సత్తాను చాటేవిధంగా గ్రాఫిక్స్ ఉన్నాయని కితాబిచ్చారు. ఈ మేరకు ట్విట్టర్లో స్పందించారు. మహీంద్రా అధినేత ట్వీట్లకు రాజమౌళి ట్విట్టర్ వేదికగా థ్యాంక్స్ చెప్పారు. జక్కన్న ట్వీట్ కు స్పందనగా... "సీక్వెల్ కోసం ఆగలేను. ఎక్కువ సమయం తీసుకోవద్దు" అంటూ ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.

More Telugu News