Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓటుకు నోటు కేసులో వేం నరేందర్ రెడ్డి తనయుడికి ఏసీబీ నోటీసులు

ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తోంది. తాజాగా, టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి తనయుడు కృష్ణకు నోటీసులు జారీ చేసింది. విచారణ నిమిత్తం ఏసీబీ కార్యాలయానికి బుధవారం ఉదయం 10.30 గంటలకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. అంతకుముందు, ఏసీబీ వేం నరేందర్ రెడ్డికి కూడా నోటీసులు పంపడం తెలిసిందే. ఓ రోజంతా ఆయనపై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. అనంతరం, అరెస్టు చేయకుండానే విడిచిపెట్టారు.

More Telugu News