'తమ్ముడు' హుందాగా వ్యవహరిస్తే, అన్న శవరాజకీయాలు చేస్తున్నారు: సోమిరెడ్డి
రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ నేత చిరంజీవి స్పందించిన తీరును టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తప్పుబట్టారు. చిరంజీవి శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంతో హుందాగా వ్యవహరించారని, కానీ, ఆయన అన్న చిరంజీవి మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజమండ్రి ఘటనకు చంద్రబాబును బాధ్యుడిగా చేయాలని చిరంజీవి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి సమయాల్లో ఎలా వ్యవహరించాలో పవన్ కల్యాణ్ ను చూసి చిరంజీవి నేర్చుకోవాలని సోమిరెడ్డి హితవు పలికారు.