Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజమండ్రి ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ

పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో 27 మంది మరణించడంతో, తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో, తెలంగాణలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకునే పనిలో పడింది. ఈ క్రమంలో, కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలో టీఎస్ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తనిఖీలు నిర్వహించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. అలాగే, మంథనిలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పుష్కర ఏర్పాట్లను పరిశీలించారు.

More Telugu News