పాతబస్తీలో బాహుబలి సీడీలు హల్ చల్... 115 సీడీలు స్వాధీనం చేసుకున్న సౌత్ జోన్ పోలీసులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాతబస్తీలో బాహుబలి సీడీలు హల్ చల్... 115 సీడీలు స్వాధీనం చేసుకున్న సౌత్ జోన్ పోలీసులు

భారీ బడ్జెట్ తో నిర్మితమైన ప్రతిష్ఠాత్మక జానపద చిత్రం 'బాహుబలి'కి పైరసీ బెడద తప్పలేదు. ఈ సినిమా పైరసీ సీడీలను హైదరాబాదు పాతబస్తీలోని చార్మినార్ సమీపంలో ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన సౌత్ జోన్ పోలీసులు మీర్ చౌక్ లో ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద 115 సీడీలను పట్టుకున్నారు. కాగా, శనివారం ఉదయం బాహుబలి హిందీ వెర్షన్ చిత్రం ఆన్ లైన్ లో దర్శనమివ్వడం తెలిసిందే. బాహుబలి పైరసీని గుర్తించిన పుణే పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు.

More Telugu News