ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న బాలుడి చిరకాల కోరికను తీర్చిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న బాలుడి చిరకాల కోరికను తీర్చిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్

ప్రాణాంతక వ్యాధితో భాధపడుతున్న 11 ఏళ్ల బాలుడి చిరకాల కోరికను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) నెరవేర్చి మానవత్వం చాటుకుంది. తమిళనాడుకు చెందిన ముఖిలేష్ (11) ప్రాణాంతకమైన తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. ఎన్నాళ్లు జీవిస్తాడో తెలియని ఆ బాలుడికి పైలట్ కావాలన్నది కోరిక. దీంతో ఓ స్వచ్ఛంద సంస్థ బాలుడి చిరకాలవాంఛను నెరవేర్చే ప్రయత్నం చేసింది. సాధారణంగా విమానాల్లోని కాక్ పిట్ లో ఇతరులకు ప్రవేశం నిషిద్ధం. అదే కఠినమైన నిబంధనలుండే ఎయిర్ ఫోర్స్ లాంటి వాటిల్లో కాక్ పిట్ వరకు వెళ్లాలంటే అసాధ్యమే. ఈ నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థ సహకారంతో స్పందించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు లాంఛనాలు పూర్తి చేసి, బాలుడ్ని ఒక రోజు గౌరవ పైలట్ ను చేశారు. కోయంబత్తూరులోని వైమానిక దళ బృందం ముఖిలేష్ కు బ్యాడ్జ్, క్యాప్ అందజేసి పైలట్ సీట్లో కూర్చోబెట్టారు. అంతటితో ఆగకుండా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో మాట్లాడే అవకాశం కల్పించారు. దీంతో బాలుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దేశంలో ఈ అరుదైన గౌరవం అందుకున్న పిన్న వయస్కుడు ముఖిలేష్ కావడం విశేషం.

More Telugu News