పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం...సమస్యను జటిలం చేయొద్దని సూచన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం...సమస్యను జటిలం చేయొద్దని సూచన

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఎంపీలు ఏం చేశారని టాలీవుడ్ అగ్రనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్పందించారు. సమస్యను మరింత జటిలం చేసేలా వ్యవహరించవద్దని పవన్ కల్యాణ్ కు సూచించారు. నిన్న ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు కాస్త కటువుగానే మాట్లాడారు. ‘‘మీరు అడక్కపోయినా, నా అంతట నేనే చెబుతున్నాను. పవన్ కల్యాణ్ ఏమన్నారు? ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. సమస్యలు పరిష్కారం కావడంపై దృష్టి కేంద్రీకరించకుండా జటిలం చేసుకోవడానికి ఒక్క నిమిషం పట్టదు. ఇలాంటి సమయంలో సంయమనం పాటించాలి. మనది కొత్త రాష్ట్రం. రాజధాని లేదు. సమస్యలున్నాయి. ఆర్థిక ఇబ్బందులున్నాయి. పెట్టుబడులు రావాల్సి ఉంది. ఇవన్నీ ఒక్కరాత్రిలో పరిష్కారం కావు. అందరి సహకారం తీసుకుని కష్టపడి ఎంత త్వరగా వీలైతే, అంత త్వరగా సమస్యల నుంచి బయటపడేందుకు చూడాలి’’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

More Telugu News