కాంగ్రెస్ నుంచి ఆగని వలసలు...వైఎస్సార్సీపీలోకి వెళ్లనున్న మాజీ మంత్రి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాంగ్రెస్ నుంచి ఆగని వలసలు...వైఎస్సార్సీపీలోకి వెళ్లనున్న మాజీ మంత్రి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు ఆగడం లేదు. కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గత నెల వైఎస్సార్సీపీలో చేరగా, ఈ మధ్యనే మాజీ పీసీసీచీఫ్ డీఎస్ టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. వారి బాటలోనే మరో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ నడవనున్నారు. ఈ నెల 13న వైఎస్సార్సీపీలో డొక్కా మాణిక్యవరప్రసాద్ చేరనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

More Telugu News