Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీ అభివృద్ధికి ఎన్ఆర్ఐలు ముందుకు రావాలి: స్పీకర్ కోడెల

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధికి విశేష కృషి జరుగుతోందని స్పీకర్ కోడెల శివప్రసాద్ కాలిఫోర్నియాలో చెప్పారు. రాజధాని నిర్మాణానికి చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు చొరవ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. వృత్తిపరంగా తాను వైద్యుడినని కానీ, ఎన్టీఆర్ స్పూర్తితో రాజకీయాలలోకి వచ్చానని వెల్లడించారు. ఈ క్రమంలో ఏపీ అభివృద్ధికి ఎన్ఆర్ఐలు ముందుకు రావాలని, తమవంతు సాయానికి తోడ్పడాలని కోరారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న కోడెలను కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ప్రముఖులు కోమటి జయరాం, కోగంటి వెంకట్ సన్మానించారు. ఎన్ఆర్ఐ తెలుగు విభాగం చేపట్టిన పలు కార్యక్రమాలను ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో కోడెల కుమారుడు శివరామ్ కూడా పాల్గొన్నారు.

More Telugu News