పచ్చ చొక్కా వేసుకురా, నువ్వో నేనో తేల్చుకుందాం!: ఎస్పీ కి భూమా సవాల్
అధికార తెలుగుదేశం పార్టీకి తొత్తుగా మారిన కర్నూలు ఎస్పీ రవికృష్ణ తన ఉద్యోగానికి రాజీనామా చేసి అదే పార్టీలో చేరి, పచ్చ చొక్కా వేసుకు రావాలని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సవాల్ చేశారు. ఆపై నంద్యాలలో తన మీద పోటీ పడొచ్చని సలహా ఇచ్చారు. నంద్యాలలో రౌడీయిజం, ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం మోపుతానని రవికృష్ణ చేసిన వ్యాఖ్యలపై భూమా కౌంటర్ ఇచ్చారు. ఫ్యాక్షనిజాన్ని నడుపుతున్నదే తెలుగుదేశం పార్టీ అని ఆరోపించారు. పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి, టీడీపీ తరపున రవికృష్ణ నంద్యాలలో బరిలోకి దిగాలని, అప్పుడు నువ్వో నేనో తేల్చుకోవచ్చని అన్నారు.